బడ్జెట్ అంతా అంకెల మాయ

విజయవాడః 2016-17కు సంబంధించి 11.61 శాతం జీడీపీ గ్రోత్ రేటుతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందంటూ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించినదంతా అంకెల మాయేనని వైయస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు చూసిన తర్వాత బడ్జెట్‌లో వీళ్లు చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు.

Back to Top