ఒంగోలు: ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది న్యాయస్థానాలేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వైఖరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఒంగోలు వచ్చిన మేకపాటి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రూ.వెయ్యి నోట్ల రద్దుకు తానే సిఫార్స్ చేశానని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అని మేకపాటి ధ్వజమెత్తారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పీకల్లోతు కరువులో కూరుకుపోయిందని, చంద్రబాబు పాలనపై ప్రజలు అసహనానికి గురవుతున్నారని అన్నారు.