ముసిలి ముప్పుల తొలి సమర్తె లా టీడీపీ దీక్షలు

నాలుగేళ్ల నుంచి
ప్రజలను మోసం చేస్తూనే  ఉన్నాడనీ ఎమ్మెల్యే
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు . అనంతపురం వంచన పై గర్జన దీక్షలో ఆయన
ప్రసంగిస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు వైఖరిని తూర్పారబడుతూ తనదైన శైలిలో
వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆయన ఇంకా
ఏమన్నారంటే...

 చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన సొంత ప్రయోజనాలను
కాపాడుకునేందుకే తప్ప ప్రజల మేలు కోసం ఎంత మాత్రం కాదు. ప్రత్యేక హోదా కోసం
పోరాడుతున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి ఇప్పుడొచ్చి హోదా కోసం
పోరాడుతానని  డ్రామాలు ఆడుతున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేసి
దొడ్డిలో కట్టేసుకున్న చంద్రబాబుకు నైతిక హక్కులు లేవు. నాలుగేళ్లు బీజేపీతో
అంటకాగి నోరెత్తని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తుక్కు దీక్షలు
చేస్తున్నాడు. ముసిలి ముప్పుల తొలి సమర్తె లా ఉన్నాయి టీడీపీ దీక్షలు. 11 రోజులు గడిచినా సీఎం రమేశ్‌ దీక్షల్లో అదే హుషారు
ఎలా ప్రదర్శించారు. దీక్ష పూర్తయిన తర్వాత ఆయన పోరాట యోధుడిలా లేడు.. అత్తారింట్లో
అల్లెం తిన్న అల్లుడిలా తయారయ్యాడు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసేదానికి మా ధన మాన
ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ
ఎమ్మెల్యేలను గెలిపించి జగన్‌ను సీఎం చేసుకుంటాం. జగన్‌ సీఎం అయ్యే వరకు భుజాలపై
నల్ల కండువా తీయను.

తాజా ఫోటోలు

Back to Top