అభివృద్ధి పేరుతో వ్యాపారం చేస్తున్న బాబు

నెల్లూరు: చంద్రబాబు ప్రజలను అడ్డం
పెట్టుకుని అభివృద్ధి పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. ఆయనో 420.. ఛీటర్‌ అని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి
మండిపడ్డారు. వంచనపై గర్జన సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి పేరుతో
బాబు ఎంత దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. వైయస్‌ఆర్‌ పాలనకు బాబు పాలనకు
నాగలోకానికి నక్కకు ఉన్నంత తేడా ఉంది. పేదలకు భూములు పంచిన చరిత్ర వైయస్‌ఆర్‌ది.
వైయస్‌ఆర్‌ హయాంలో ఎక్కువ మంది టీడీపీ నాయకులే లబ్ధిపొందారు. మొన్న ఎన్నికల్లో
చంద్రబాబుకు ఓటేసిన జనమంతా ఎందుకు వేశామా అని ఇప్పుడు మదనపడుతున్నారని అన్నారు.
రాజశేఖరుడు లేని కొరత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. వెంకన్న సాక్షిగా
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన చంద్రబాబు, నరేంద్రమోడీలు జనాలకు పంగనామాలు
పెట్టారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు
శంకుస్థాపనలు చేసి చంద్రబాబు అంతా నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. ఆఖరికి వెంకన్న
సామి పోటులో తవ్వకాలు జరిపి దోపిడీకి పాల్పడిన నీచుడు చంద్రబాబు అని ఆరోపించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top