ఉపకార వేతనాలను తొలగించేందుకు బాబు కుట్ర

విజయవాడ: విద్యా వ్యవస్థలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను తొలగించేందుకు కుట్రలు పన్నుతోందని అనుమానం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌ హాజరంటూ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనకు దిగుతామని అంజిరెడ్డి హెచ్చరించారు.

Back to Top