<strong>ఢిల్లీః</strong>ప్రత్యేక హోదాతో మాత్రమే ఏపీకి న్యాయం జరుగుతుందని మొదటి నుంచి చిత్తశుద్ధితో పోరాడుతున్న వ్యక్తి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ నిరవధిక దీక్ష చేపట్టారన్నారు.నేడు ప్రజలందరికి ప్రత్యేకహోదా అవసరం అని తెలిసి వైయస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారన్నారు.రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎలా అధికారంలోకి రావాలని ఉద్ధేశ్యంతో చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటున్నాడన్నారు.నిజంగా ఏపీ అభివృద్ధి చేయాలని కాని,పరిశ్రమలు తీసుకురావాలని కాని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాని చంద్రబాబులో ఆలోచన లేదన్నారు.నాలుగు సంవత్సరాలను ప్రత్యేకహోదాను హేళన చేసిన చంద్రబాబు.. ఎన్నికల తరుణంలో ప్రత్యేకహోదా గుర్తుకువచ్చిందా అని ప్రశ్నించారు.టీడీపీ,బీజేపీలు ప్రత్యేకహోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మోసం చేశారన్నారు.