ఏపీలో భక్షించి..దేశంలో రక్షిస్తావా..


ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదు..చంద్రబాబు ఉన్నారు..
టీడీపీ కాదు..శునకా నంద పార్టీ..
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

విజయవాడఃవైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడికత్తి పార్టీ అని పైశాచిక ఆనందం  పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌ రెడ్డిపై దాడి జరిగితే అదృష్టవశాత్తూ అది చేయికి తగిలి గాయమై చికిత్స పొందుతున్న సందర్భాన్ని అవహేళనగా మాట్లాడటం తప్పుబట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై  దాడి జరిగితే పరామర్శించాల్సిన నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు శునకానందం పొందుతున్నారని వమిర్శంచారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విలువను రోజురోజుకు దిగజార్చి చివరికి కాంగ్రెస్‌తో జతకట్టడం దారుణమన్నారు. నీతిబాహ్యమైన, జుగుప్సకSరమైన చంద్రబాబు,రాహుల్‌ కలయిక అని దుయ్యబట్టారు.  జాతీయ ప్రయోజనాలు కోసం కలిశారంటూ ఎల్లోమీడియా డప్పు వాయిస్తుందన్నారు.  ప్రజాసామ్యాన్ని భక్షించే రాక్షస మనస్తత్వంతో చంద్రబాబు ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యామా..భక్షించడమా సమాధానం చెప్పాలన్నారు. రాజీనామాలు చేయించకుండా స్పీకర్‌ వ్యవస్థను మేనేజ్‌ చేశారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చారన్నారు. టీడీపీ కాదు.. శునకానంద పార్టీ అని ఎద్దేవా చేశారు.ఆంధ్రలో ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తావు.. ఢిల్లీ వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తావా..అంటూ మండిపడ్డారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి శాకాహారం భజన చేస్తే ఎవరు నమ్ముతారన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు..చంద్రబాబు ప్రమాదంలో ఉన్నారని,. అవినీతి,అక్రమాలతో వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబు తనకు ప్రమాదం రాబోతుందనే భయంతో ఎవరినైనా కలుస్తారని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడుతుంటే బ్రహ్మానందం మాట్లాడుతున్నారని ప్రజలు ఆనందం పొందుతున్నారన్నారు. కాంగ్రెస్‌ కూడా గత్యంతరం లేక టీడీపీతో వేల్రాడుతోంది. కాంగ్రెస్‌ వాదులు ఇప్పుటికైనా పునరాలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాతాళంలోకి పోతున్న తరుణంలో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాయకత్వం స్వీకరించి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను కాపాడిన వ్యక్తి అని అన్నారు. మహాకూటమిగా ఏర్పడిన చంద్రబాబును తుక్కుతుక్కుగా ఓడించి 33 ఎంపీ సీట్లు ఢిల్లీకి అప్పజెప్పి  మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిమంత్రి అవ్వడానికి వైయస్‌ఆర్‌  ప్రధాన కారకుడయారన్నారు. అలాంటి వైయస్‌ఆర్‌ చనిపోయాక కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌కు బహుమతి ఏమిచ్చిందని ప్రశ్నించారు. ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా.. ఇది కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతిఫలం అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ టీడీపీతో కలవడం వ్యతిరేక చర్య గా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు కూడా ఆలోచించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రారంభించి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించిన పార్టీని దినదినాప్రవర్థమానంగా చేసి చంద్రబాబు చేతుల్లో పెడితే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు.

Back to Top