బాబుది అంతా ప్రచార ఆర్భాటమే

విశాఖపట్నంః చంద్రబాబు తన ప్రచార ఆర్భాటం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి  తుళ్ళి చంద్ర శేఖర్ మండిపడ్డారు . సింధుకు రజతం రావడానికి కూడా నాప్రోత్సాహమే అని బాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. హైటెక్ సిటీ కట్టాను అని  గొప్పలు చెప్పుకుంటున్న బాబు వాస్తవానికి అక్కడ చేసిందేమీ లేదన్నారు. అక్కడ జరిగింది అంతా భూ కుంభ కోణమేనన్నారు. ఒక విదేశీ పరిశోధక విద్యార్థిని  చంద్రబాబు అవినీతి గురించి  ప్రపంచస్థాయిలో వెలుగులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

విశాఖలోని పార్టీ కార్యాలయం లో జరిగిన  పత్రికా సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.... రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 1.45 లక్షల పోస్టలు కాగా, ఇప్పుడు అవి 2 లక్షల ఫై మాటేనని తెలిపారు. ఏటా 2 లక్షల మంది విద్యార్థులు చదువులు అయిపోయి  నిరుద్యోగులుగా మారుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో స్పష్టత ఇవ్వకపోవటంతో నిరుద్యోగులు అయోమయం చెందుతున్నారన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండానే... లక్షల పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top