'అసెంబ్లీకి వందమంది బీసీలపై చర్చకు సిద్ధం'

హైదరాబాద్:

వంద మంది బీసీలను అసెంబ్లీకి పంపుదామన్న తన ప్రతిపాదనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తాము విసిరిన సవాలుకు అందుకే సక్రమంగా బదులు చెప్పడం లేదనీ, వంకరటింకరగా మాట్లాడుతున్నారనీ ఆయన ఎద్దేవా చేశారు.

Back to Top