అశేష జనాభిమానం మధ్య షర్మిల పాదయాత్ర

జ్యేష్టవారిపాలెం (గుంటూరు జిల్లా), 9 మార్చి 2013: రాజన్న తనయ, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర అశేష జనవాహిని మధ్య హుషారుగా కొనసాగుంతోంది. శనివారం ఉదయం శ్రీమతి షర్మిల గుంటూరు జిల్లా జ్యేష్టవారిపాలెం నుంచి ప్రారంభించిన 86వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.‌ పార్టీ శ్రేణులు, పాదయాత్ర మార్గంలో ఉన్న స్థానిక ప్రజలకు శ్రీమతి షర్మిల అభివాదం చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు, దానికి వత్తాసుగా ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో కష్టాలు పడుతున్న ప్రజలకు అండగా మేమున్నామంటూ శ్రీ జగన్‌ తరఫున శ్రీమతి షర్మిల భరోసా ఇస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల దారి పొడవునా ప్రజల కష్టాలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటూ నడుస్తున్నారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగుతున్నదని  వైయస్‌ఆర్‌సిపి గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ కార్యక్రమాల రా‌ష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. భోజన విరామ‌ం అనంతరం గణపవరంలో జరిగే బహిరంగ సభలో శ్రీమతి ప్రసంగిస్తారు.
Back to Top