ఘనంగా వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో కాటన్‌ జయంతి వేడుకలు

రాజమండ్రి: సర్‌ అర్ధర్‌ కాటన్‌ జయంతి వేడుకలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీజీసీ మెంబర్‌ జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నాయకులు ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్‌లు ధవళేశ్వరం ప్రాజెక్టుపై గల కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా రాజబాబు, రామచంద్రారావు, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన
ధవళేశ్వరం సెంట్రల్‌ డివిజన్‌ కార్యాలయాన్ని తరలించడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీ్రరాజులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top