'‌అప్పు కట్టలేను.. విషమిచ్చి చంపుతరా!'

సరంపేట (నల్గొండ జిల్లా) : ‘బ్యాంకు అప్పు రూ.50 వేలు తెచ్చుకుంటే.. వడ్డీతో కలిపి రూ. లక్ష అయింది. కరెంటు లేదు.. వర్షాలు లేవు. పత్తి పెడితే ఎకరానికి మూడు క్వింటాళ్లు ఎల్లకపోయె. దాన్ని తీసుకొని మార్కెట్‌కు పోతే క్వింటాల్‌కు రూ. 2,500, రూ. 3,000 కంటే ఎక్కువ పడకపాయే. ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు చేసి పంట వేస్తే రూ. 10,000 కూడా చేతికి రాకపోతే.. ఇంకా ఎక్కడి నుంచి తెచ్చి అప్పు కట్టాలె. అప్పు కట్టమని ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పెడుతుండ్రు. అప్పు కట్టలేను... నన్ను సంపుతరా? ఇంత విషమిచ్చి చంపండి’ అని నల్లగొండ జిల్లా సరంపేటకు చెందిన రైతు రావుల కిష్టయ్యగౌడ్.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.‌ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు.

‘రాజశేఖరన్న ఉన్నప్పుడు ఇట్నే ఉండెనా..! నెలకు మూడు వానలు పడ్డయి. కాలం కమ్ముగయింది. రామారావు అప్పుడు కూడా కాలం మంచిగయినది. రూపాయి పెడితే పావుకిలో కూరగాయలు వచ్చినయి.. ఇప్పుడు రూ. 10 పెట్టినా పావుకిలో రావట్లేదు. ఇప్పుడున్నోనికి రైతులంటే తెలుసునా? రైతుల కష్టం తెలుసునా.. కాలం లేదు.. కరెంటు రాట్లేదు అంటే రూ. వేలకు వేలు కరెంటు బిల్లు పంపుతడా? రాజశేఖరన్నను తలుసుకొని బాధపడని రోజే లేదు. జగనన్న వస్తేనే బాధలు తీరుతయని గింత పిలగాని నుంచి ముసలమ్మ దాకా అందరూ అంటుండ్రు’ అని కిష్టయ్యగౌడ్ అన్నారు.‌ రైతులు అధైర్య పడొద్దని.. త్వరలోనే జగనన్న వస్తారని,‌ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగం మళ్లీ తెస్తారని షర్మిల ధైర్యం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top