అసలు దోషులను వదిలి చిరుద్యోగులపై వేటు

గుంటూరుః లింగాయపాలెంలో అరటితోటల ధ్వంసం వ్యవహారాన్ని ప్రభుత్వం పోలీసులు, అధికారులను ఉపయోగించి పక్కదోవ పట్టిస్తోంది. పంటల ధ్వంసానికి పాల్పడుతున్నదోషులపై చర్యలు తీసుకోకుండా...చిరుద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోంది.  భూ సమీకరణకు అభ్యంతర పత్రాలిచ్చామనే కక్షతో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే పంటలు నాశనం చేశారని బాధిత రైతులు చెబుతుంటే ... అధికారులు మాత్రం తమదైన శైలిలో వ్యవహారాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.

లింగాయపాలెం వీఆర్‌వో వెంకటేశ్వరరావు, వీఆర్‌ఏ యాకోబు, ఏపీ ఆగ్రోస్ సూపర్‌వైజర్ సుబ్రహ్మణ్యంలను అధికారులు సప్సెండ్ చేశారు. ఇందులో కీలకమైన అధికారులు, నేతల హస్తం ఉన్నా గ్రామస్థాయి సిబ్బందిపై వేటువేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు అంటున్నారు. అరటి తోటలను ధ్వంసం చేయడాన్ని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాజ్యసభ మాజీ  సభ్యుడు యలమంచిలి శివాజీ, ఏపీ రైతు సంఘం నేతలు తప్పుపట్టారు.
Back to Top