<br/><br/><br/>ఏపీలో రావాలి జగన్–కావాలి జగన్ కొనసాగుతోంది.డివిజన్‌ల్లో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి నవరత్నాలను ప్రచారం చేసి అవగాహన కలిగిస్తున్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచిరోజులు వస్తాయని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పొన్నూరు నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ సమన్వయ కర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో 12వ వార్డులో వైయస్‌యస్‌ఆర్‌సీసీ సమన్వయకర్త మానుగుంట మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు,నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా మదనపల్లిలో కురవంకలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో, బీఎన్‌కండ్రిగ టౌన్‌లో బీసీ కాలనీలో వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం నేతృత్వంలో నిర్వహించారు.పార్టీనేతలు విద్యానాథ్‌రెడ్డి, గోపీయాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో,కర్నూలు జిల్లా నంద్యాల 14వ వార్డులో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో, వైయస్‌ఆర్ జిల్లా రాజపేట నియోజకవర్గంలో సిద్ధవటం మండలం ఎస్.రాజంపేటలో నిర్వహించిన జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పాల్గొని నవరత్నాల పథకాలపై ప్రజలకు అవగాహనన కలిగించారు. కడప నగరంలో 3వ డివిజన్‌లో ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబు నేతృత్వంలో, కోడూరు జంగిటివారిపల్లిలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.