టీడీపీ,బీజేపీ నయవంచనకు నిరసనగా ఏపీ బంద్బాబు ఐదుకోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతీశారుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుదాం..హోదాను సాధిద్దాంహోదా కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ వైయస్సార్సీపీయేవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణహైదరాబాద్ః విద్యార్థులారా కలిసిరండి... కార్మికులారా కదం తొక్కండి... రాజకీయ పక్షాలు మీ బాధ్యత నెరవేర్చండి... మేధావులారా మీవంతు గొంతు వినిపించండని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి టీడీపీ, బీజేపీ చేసిన నయవంచనకు నిరసనగా ఈ నెల 2వ తేదీన వైయస్సార్సీపీ తలపెట్టిన ఏపీ బంద్‌కు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి అన్న నినాదంతో అందరం కలిసి పోరాడదామన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...* రాష్ట్రంలోని ఐదుకోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు* ప్రత్యేక హోదా కోసం రాజకీయ నాయకులు, ప్రజలు ఎన్నోరకాలుగా ఆందోళనలు చేశారు. * ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి జరిగే మేలును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నోసార్లు తెలియజేశారు. యువభేరీలు నిర్వహించారు. * ప్రత్యేక కోసం అందరూ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా... ప్రత్యేక హోదా సాధించుకోవాలి* ప్రత్యేక హోదా రాదని రాజ్యసభలో అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు* రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీరాలన్నా... పారిశ్రామిక అభివృధ్ధి జరగాలన్నా.. రాష్ట్రం అభివృధ్ధి చెందాలన్నా ప్రత్యేక హోదా రావాలి* జపాన్, సింగాపూర్ లాగా ఏపీని తయారుచేస్తామని సీఎం చెబుతున్న మాటలు కేవలం ఆయన స్వార్థం కోసమే.* ఇప్పటికే రాష్ట్ర మిగులు జలాలను మొత్తం బాబు ఎగువ రాష్ట్రాలకు తాకట్టు పెట్టారు* ప్రత్యేక హోదా రాకపోతే... నిధులు కేటాయించకపోతే ఏపీ ఎడారిగా మారుతుంది* ఏపీ బంద్‌లో అందరూ పాల్గొని తమ గొంతు వినిపించండి* విద్యార్థి, కార్మిక, యువకులు, విద్యాసంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు, వాణిజ్య రంగాలు ఇప్పటికే స్వచ్ఛందంగా బంద్‌కు పూర్తి మద్దతు తెలిపాయి* ప్రత్యేక హోదా కోసం ఎంతోమంది ఆందోళనలు చేస్తున్నా.... టీడీపీ, సీఎంలో మాత్రం మార్పు రాలేదు* రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు అపార రాజకీయ అనుభవం ఉందంటూ పత్రిక ప్రకటనలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు* ప్రజల మనోభావాలకు అనుగుణంగా... రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష బాధ్యతగా... ప్రత్యేక హోదా కోసం ఏపీ బంద్ కు పిలుపునిచ్చాం.* ఈ రోజు పార్లమెంట్‌లో వైయస్సార్‌సీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. * స్పీకర్ తిరస్కరించారు అయినా సరే ఎంపీలు ఆందోళన చేశారు. * టీడీపీ నేతలు మాత్రం కూర్చొని సినిమా చూస్తున్నారు* బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేశాం.* వారం రోజుల పాటు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గుంటూరులో నిరవధిక నిరహార దీక్ష చేశారు.* ప్రత్యేక హోదా కోసం ఆనాడు ఆందోళనలు, బంద్‌లు చేస్తే చంద్రబాబు అవహేళనగా మాట్లాడారు... ఇప్పుడు ప్రత్యేక హోదాపై కేంద్రాన్నిఎందుకు నిలదీయడం లేదు* ప్రత్యేక హోదా వస్తే రూ. 5వేల కోట్లు వస్తాయి... రూ. 50వేల కోట్లు ఇస్తే చాలంటున్న చంద్రబాబు వైఖరేంటో అందరికీ అర్థమైంది