బాబుకు బీసీ దెబ్బ చూపిద్దాం

  • మహానేత వైయస్‌ఆర్‌ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది
  • జగనన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి
  • బీసీల సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తారు
  • బీసీలు కులవృత్తులపై ఆధారపడాలనే ఆలోచన బాబుది
  • పిల్లలంతా మంచి చదువులు చదవాలనే ఆరాటం జగనన్నది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

మైదుకూరు: రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక, అరాచక పాలనకు చరమగీతం పాడాలని 3 వేల కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. మైదుకురు నియోజకవర్గంలోని కానగూడురులో వైయస్‌ జగన్‌ బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ...స్వాతంత్య్రం వచ్చిన తరువాత బీసీలకు అండగా నిలిచింది ఇద్దరే వ్యక్తులనే ఒకరు ఎన్టీఆర్‌ అయితే మరొకరు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీసీల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారన్నారు. అలాంటి మహానత రుణం తీసుకునే అవకాశం వచ్చిందన్నారు. బీసీలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 

వైయస్‌ఆర్‌ స్వర్ణ యాగాన్ని తీసుకొచ్చేందుకు బీసీలంతా ఏకమై జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఇంతకాలం బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. బీసీల దెబ్బ ఏంటో చంద్రబాబు చూపిద్దామని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. బీసీలెప్పుడు కులవృత్తులపైనే ఆధారపడాలనే ఆలోచన చంద్రబాబుదన్నారు. కానీ బీసీల పిల్లలంతా ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆరాటం వైయస్‌ జగన్‌దన్నారు. అందుకని ఒక కమిటీ కూడా వేశారన్నారు. బీసీల కష్టాలు తెలుసుకోండి.. ప్రజల దగ్గర నుంచి మ్యానిఫెస్టో తయారు చేయండి.. ఆ మ్యానిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి వారిని అభివృద్ధి చేద్దామని కమిటీ వేశారన్నారు. సంక్షేమ ప్రభుత్వం ఒక్క జగనన్నతోనే సాధ్యమని, జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ కోరారు. 
Back to Top