అంకెల గారడీలో ప్రభుత్వానికి డాక్టరేట్!


జగన్ సోదరి షర్మిల చురకలు
తిమ్మాపురం:

అంకెల గారడీపై రాష్ట్ర ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వవచ్చని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల చమత్కరించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా గురువారం తిమ్మాపురంలో ఆమె డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. గురువారం నాటి యాత్రలో ప్రజలు ఆమెతో ముఖ్యంగా నీటి సమస్య గురించి ప్రస్తావించారు. ఎటువంటి సాయమూ అందడంలేదని మహిళలు చెప్పారు. ఇలా షర్మిలకు సమస్య మీద సమస్య చెబుతూ వచ్చారు. అనంతపురం ఎమ్మల్యే గుర్నాథరెడ్డి కూడా ఆమెకు ఇదే అంశాన్ని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి కాగానే అన్ని సమస్యలూ పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top