అమెరికాలో సేవ సంస్థలకు విరాళం

అమెరికా:

ఈశాన్య అమెరికాలోని డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ తరపున ఆయన అభిమానులు ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానుల నుంచి నిత్యావసర వస్తువులు సేకరించారు. వీటిని న్యూజెర్సీలోని మెర్సర్ స్ట్రీట్ ఫ్రెండ్సు , న్యూయార్కులోని పీపుల్ టూ పీపుల్ అనే సేవా సంస్థలకు విరాళంగా అందించినట్లు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనాధ పిల్లలు, వృద్ధులకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా విదేశాల్లోని స్థానిక ప్రజలకు సహాయం అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు సహయ పడడం తృప్తి కలిగిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ విధంగా స్థానిక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ డాక్టర్ వైయస్‌ఆర్ ఆశయాలను విదేశీయులకు తెలియజేసి వారి మనస్సులను డాక్టర్ వైఎస్‌ఆర్ ఫౌండేషన్ చూరగొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు అళ్ల రామిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top