నధుల అనుసంధానం కాదు..నిధుల అనుసంధానం..!

చంద్రబాబుపై అంబటి ఫైర్..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తోటపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు  రాజశేఖర్ రెడ్డి పట్టుదలతో కృషిచేశారని  చెప్పారు. సాగునీటి ప్రాజెక్ట్ లు చిత్తశుద్ధితో పూర్తి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తనను తాను మార్కెటింగ్ చేసుకోవడంలో చంద్రబాబు నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం జరిగిందని చంద్రబాబు గొప్పలు చొప్పుకుంటున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం కాదు టీడీపీ ఆఫీసుకు నిధుల అనుసంధానం జరిగిందని అంబటి ఫైర్ అయ్యారు. 

పోలవరంను పక్కనబెట్టి కమీషన్ల కోసం పట్టిసీమను తెరపైకి తీసుకొచ్చారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పంపులు లేకుండానే ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసిన ఘనత చంద్రబాబుదేనని హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. పట్టిసీమ పూర్తి కాకుండానే తాటిపూడి నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమ ప్రజలకు నీళ్లిచ్చానని మభ్యపెడుతున్నారని పచ్చనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలకు ఏం చేయాలనుకున్నారో అది చేసి చూపించాలే తప్ప...మోసం చేయొద్దని హితవు పలికారు. 
Back to Top