<strong>మహబూబ్‌నగర్, 1 డిసెంబర్ 2012:</strong> శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా అల్లిపురం శివారు నుంచి ప్రారంభమైంది. వేలాది మంది వైయస్‌ఆర్ అభిమానులు, కార్యకర్తలు మద్దతుగా వెంట నడుస్తుండగా షర్మిల 45వ రోజు యాత్రలో ముందుకు కదిలారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మద్దూరు, చిన్నచింతకుంట, ఎద్దులాపురంలలో శ్రీమతి షర్మిల పాదయాత్ర నిర్వహిస్తారు. ఎద్దులాపురంలో మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఆమె చినవడ్లమాను, పెదవడ్లమాను, నెల్లికొండి గ్రామాల జాతీయ రహదారి వరకూ పాదయాత్ర చేస్తారు. శనివారం రాత్రికి నెల్లికొండి గ్రామ శివారులో షర్మిల బస చేస్తారు.