<strong>విజయవాడః </strong>వైయస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ అడ్డగోలు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు సీబీఐ అంటే భయం ఎందుకు అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్ తన కుటుంబసభ్యులపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకున్నారన్నారు.