శిల్పాకు అక్కినేని ఫ్యాన్స్ మద్దతు

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైయస్సార్‌ సీపీకి మద్దతు పెరుగుతోంది.  నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు నిన్న శిల్పాకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.  తాజాగా అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్‌రెడ్డికి ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించించింది. అక్కినేని అభిమానులు అందరూ శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కినేని ఫ్యాన్స్‌ ఆలిండియా అధ్యక్షుడు రామరాజు విజ్ఞప్తి చేశారు.

కాగా, సూపర్‌స్టార్‌ కృష్ణ, 'ప్రిన్స్‌' మహేశ్‌బాబు అభిమానులు వైయస్సార్‌ సీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది.
Back to Top