ఆకేపాటికి పితృవియోగం

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు ఆకేపాటి అమ‌ర్‌నాథ్‌రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఆకేపాటి లక్ష్మీరెడ్డి(82) హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11.50 గంటలకు పరమపదించారు. ఆకేపాటి లక్ష్మీరెడ్డికి భార్య అనసూయమ్మ, ఇద్దరు కుమారులు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఆశమ్మ, అనితమ్మ ఉన్నారు. చిన్న తనం నుంచే రాజకీయాల వైపు మొగ్గుచూపిన లక్ష్మీరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కురువృద్ధుడు, రాజకీయ దురందురుడు కొండూరు మారారెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ నిజాయితీతో కూడుకున్న రాజకీయం చేసిన వ్యక్తిగా నియోజకవర్గవాసులకు సుపరిచితుడు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి 30 సంవత్సరాలు ఆకేపాడు గ్రామ సర్పంచ్‌గా,ఉపసర్పంచ్‌గా సేవలందించారు. ఈయన మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం ఆకేపాడులోని కట్టకిందపల్లెలో గల స్వగృహంకు చేరుస్తారు. అనంతరం బుధవారం ఉదయం 11గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Back to Top