ఎయిర్‌పోర్టు నిర్ణయం ఉపసంహరణ దుర్మార్గం

నెల్లూరు: కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. దగదర్తిలో విమానాశ్రయ ఏర్పాటు ప్రతిపాదనలు ఉపసంహరించుకోవడంలో ఆంతర్యమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేరే జిల్లాకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఎయిర్‌పోర్టు కోసం భూ సేకరణ జరిపి ఇప్పుడు వేరే ప్రాంతానికి తరలించాలనుకోవడం దుర్మార్గమన్నారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టును తరలించడానికి గల ఆంతర్యమేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top