ఏపీలో వ్యవసాయం కడుదయనీయం


చంద్రబాబుకు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డు
ఏం సాధించాడని అవార్డు ఇస్తున్నారో అర్థం కావడం లేదు
ఉల్లి, టమాట, బత్తాయి గిట్టుబాటు లేక పారబోస్తున్నారు
అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి

విజయవాడ: వ్యవసాయం దండగ అనే వ్యక్తి పాలనలో రాష్ట్రంలో రైతు కడుదయనీయ దుస్థితి ఎదుర్కొంటున్నాడని, పంట పండించేందుకు అవస్థలు, పండించిన పంటకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా రాష్ట్రమంతా భావిస్తున్న తరుణంలో బాబుకు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు ప్రకటించడం.. రోజూ భార్యను వేధించే తాగుబోతుకు ఉత్తమ భర్త అవార్డు ఇచ్చేనట్లే ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులపై నాగిరెడ్డి వివరించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... నాలుగేళ్లలో సరాసరి 263 కరువు మండలాలు ప్రకటించిందన్నారు. అంటే 39 శాతం మాత్రమే పంట సాగైందన్నారు. ప్రస్తుత ఏడాది కలెక్టర్లు రాసిన రిపోర్టు ప్రకారం 394 కరువు మండలాలు ఉన్నాయన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 363 మండలాలను ప్రకటించిందన్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. 13.10 లక్షల ఎకరాల పంటకు దెబ్బ, ఇన్‌పుట్‌ సబ్సిడీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రకటించారు. అలాగే 2.50 లక్షల ఎకరాలు అధిక వర్షాలతో దెబ్బతిన్నాయి. 20 లక్షల ఎకరాల వరకు ఈ ఏడాది పంటలు దెబ్బతిన్నాయన్నారు.  

పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఉల్లిపాయలకు ధర లేదు. బత్తాయిలు, టమాట మొత్తం పారబోసుకున్నారన్నారు. ప్రస్తుతం వేరుశనగ మార్కెట్‌లోకి వస్తుంది. ఆ రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉల్లిరైతు విలవిల, రైతును పగబట్టిన పకృతి అని ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మళ్లీ అరకొర దిగుబడితో మార్కెట్‌లోకి వచ్చిన వేరుశనగ దిగుబడి క్వింటాల్‌ రూ. 4 వేలకు కొనని పరిస్థితి. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 17 వందలు ప్రకటిస్తే రూ. 13 వందలకు కొనని పరిస్థితి. తీవ్ర దుర్భిక్షంలోకి రైతు నెట్టివేయపడితే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. 

స్వామినాథన్‌ కమిటీ సిఫారస్సులు అమలు చేస్తానని, రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు రైతాంగానికి ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడు స్వామినాథన్‌ కమిటీ సిఫారస్సులు అమలు సాధ్యం కాదని కేంద్రం చెబితే ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎన్డీయేలో ఉన్న నాలుగేళ్లు కూడా లాభసాటి ధరలు కల్పిస్తామని చెప్పి మద్దతు ధరలు అరకొరగా ప్రకటిస్తే  ఏ ఒక్క రోజు మద్దతు ధరల గురించి నిలదీసిన దాఖలాలు లేవన్నారు. ఒక సెంటు కూడా వ్యవసాయ భూమిలేని సింగపూర్‌ను చంద్రబాబు ఆదర్శంగా తీసుకొని నాలుగున్నరేళ్లు వ్యవసాయాన్ని తీవ్ర దుర్భిక్షంలోకి నెట్టాడని మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకు పెట్టుబడి లేని వ్యవసాయం అంటూ వంచన మాటలు మాట్లాడుతున్నారన్నారు. పెట్టుబడి లేని పకృతి వ్యవసాయం అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అమరావతిలో రైతుల దగ్గర నుంచి లాక్కున్న 33 వేల ఎకరాల్లో బాబు చేస్తున్న వ్యవసాయం లాంటిదన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు, విత్తనాలు కూడా అవసరం లేదని మాట్లాడిన అనుమానం లేదన్నారు. 

చంద్రబాబుకు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ ప్రకటించి రైతుల ఆతాభిమానంపై దెబ్బకొట్టారని నాగిరెడ్డి అన్నారు. పంట ఉత్పత్తులు తగ్గుతుంటే. కరువు, చంద్రబాబు కవలలు అని, ఆయన ఉన్నంత వరకు కరువు ంటుందని రైతులు నెత్తీనోరు కొట్టుకుంటుంటే.. చంద్రబాబుకు అవార్డుకు ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఏ పార్టీతో కలిసి ఉన్న ఆయన మా శాశ్వత మిత్రుడేనని తాజాగా ప్రకటించిన రాజ్‌నాథ్‌సింగ్‌ బాబుకు అవార్డు ప్రదానం చేయనున్నారన్నారు. బాబు ఇంకా బీజేపీతో చీకటి రాజకీయాలు చేస్తున్నాడని అర్థం అవుతుందన్నారు. ఏం చూసి చంద్రబాబుకు అవార్డు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రుణమాఫీ, పగలు నిరంతరం తొమ్మిది గంటల విద్యుత్, రూ. 5 వేల కోట్లతో నిధి ఇది ఎక్కడైనా అమలుకు నోచుకుందా..? ఎన్టీఆర్‌ కాలం నుంచి మొదలైన దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు ఐదున్నర శాతం వడ్డీ రాయితీ ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం ఇవాల్టికి చెల్లించలేదన్నారు. 

జామాయిల్, సుబాబుల్‌ రైతులకు టన్నుకు రూ. 4,400 నుంచి రూ. 4,900లకు కొనుగోలు చేస్తామని జీఓ ఇచ్చినా.. అదీ నేటికీ అమలు కాలేదన్నారు. మొక్కజొన్న, జొన్న రైతులకు క్వింటాల్‌ రూ. 2 వందల బోనస్‌ అని చంద్రబాబు ప్రకటించినీ నేటికీ ఒక్క రూపాయి చెల్లించలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా తోతాపురి మామిడికి కిలోకి రూ. రెండున్నర చెల్లిస్తానని చెప్పి వంచించారని మండిపడ్డారు. ఆక్వా రైతులకు వైయస్‌ జగన్‌ యూనిట్‌కి రూపాయిన్నర ఇస్తామని చెబితే.. చంద్రబాబు రెండు రూపాయలు అని చెప్పి మీరు కట్టండి మత్స్య శాఖ నుంచి తిరిగి రీయంబర్స్‌ చేస్తామని వంచించాడన్నారు. క్రీడాకారులకు నోబెల్‌ ప్రైజ్‌ తెచ్చుకోండి రూ. 100 కోట్లు ఇస్తాను. ఇప్పుడు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నోబెల్‌ ప్రైజ్‌ తెచ్చుకుంటే రూ. వంద కోట్లు అంటున్నాడని, అసలు, క్రీడాకారులు, రైతులకు నోబెల్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. బహుశా లోకేష్‌కు ఉత్తమ రైతు కింద రెండు వందల కోట్లు కట్టబెట్టేందుకే మాట్లాడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 
Back to Top