సమైక్యాంధ్ర వచ్చే దాకా పోరాటం: ద్వారంపూడి

కాకినాడ :

సమైక్యాంధ్రను సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రూపొందించిన సమైక్యాంధ్ర పోస్ట‌ర్‌ను కాకినాడలోని గొడారిగుంటలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను మరింతగా భాగస్వాములను చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జెఎసికి పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Back to Top