ఏజెన్సీలో కుంటుప‌డిన విద్యా వ్య‌వ‌స్థ‌

విశాఖ‌:  ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్య‌వ‌స్థ కుంటుప‌డింద‌ని వైయస్‌ఆర్‌సీపీ టీచర్‌ అసోసియేషన్‌ నాయకులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ జిల్లాలో కొన‌సాగుతోంది. య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను ఉపాధ్యాయులు క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఐటీడీఏ ప‌రిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయల కొరత తీవ్రంగా ఉందని,  విద్యార్థుల సంఖ్యకు తగ్గ  ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో  ఏజెన్సీలో గిరిజ‌నులు చ‌దువుకు దూర‌మ‌వుతున్నార‌ని చెప్పారు. ఏజెన్సీలో విద్యార్థులు లేరనే సాకుతో సుమారు 100 పాఠశాలలను మూసివేశారని ఆ పాఠశాలలను  తిరిగి తెరిపించాలని విజ్ఞాప్తి చేశారు.  గిరిజన ప్రాంతాల్లో 33.6 శాతం మాత్రమే  విద్య అందుతుందని, విద్య, వైద్య, ఆరోగ్యపరంగా వెనుకబడి ఉన్నామన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ ..వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తామ‌ని, ప్ర‌తి ఐటీడీఏ ప‌రిధిలో ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేస్తామ‌ని, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌న‌నేత హామీతో గిరిజ‌నులు, ఉపాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
Back to Top