రాజన్న పాలన మళ్లీ చూస్తారు- బాలశౌరి

గుంటూరు

: ఎన్నికల తరువాత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మరోసారి ప్రజలందరూ చూస్తారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు బాలశౌరి అన్నారు.ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు టీడీపీ నేతలు ఎలా దోచుకుంటున్నారో అందరికి తెలుసు అన్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల వచ్చే వరకు ఆగమని సూచించారు. ఎన్నికల తరువా మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మీరంతా చూస్తారన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతుంటే చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు తన కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకోగలిగారన్నారు. చంద్రబాబుకు తన మనవడి పేరుతో రూ.10 వేల కోట్లతో డిపాజిట్‌ చేశారన్నారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్కరూ జననేతను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారన్నారు. బంగారం ఉండాల్సింది బ్యాంకుల్లో కాదు..నా అక్క చెల్లెమ్మల మెడలో ఉండాలని వైయస్‌ జగన్‌ అంటున్నారన్నారు. ఓట్లతో మీ అందరిని కొనాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామన్నారు.

Back to Top