అర్ధరాత్రి పోలీసుల అత్యుత్సాహం..అదీప్‌రాజు దీక్ష భగ్నం

విశాఖ: సింహాచలం అప్పన్న పంచగ్రామాల భూ సమస్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజు చేస్తున్న దీక్షను ప్రభుత్వం పోలీసుల సహాయంతో భగ్నం చేయించింది. ఎన్నికల ముందు పంచ గ్రామాల భూ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు తుంగలో తొక్కాడని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అదీప్‌రాజు వేపుగుండలో ఈ నెల 15వ తేదిన అమరణ నిరాహారదీక్ష చేపట్టారు. అదీప్‌ దీక్షకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. గత మూడు రోజులుగా నిరాహార దీక్షకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అర్ధరాత్రి దీక్షను భగ్నం చేశారు. అదీప్‌రాజును కేజీహెచ్‌కు తరలించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top