అధికారంలో ఉండగా ఏంచేశారు బాబూ!: విజయమ్మ


పులివెందుల:

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం గురించి ఏనాడూ చంద్రబాబు ఆలోచించలేదని ఎద్దేవా చేశారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు మంచి చేయాలని ఆలోచించని వ్యక్తి ఇప్పుడొచ్చి ఆ పని చేస్తా.. ఈ పని చేస్తా అంటే ఎవరూ నమ్మరని ఆమె చెప్పారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు  వారికి 32 మంది ఎంపీలున్నారనీ, ఆ సమయంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాన్నీ చేపట్టలేదనీ ధ్వజమెత్తారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్నీ, మద్య నిషేధాన్నీ ఎత్తివేసింది చంద్రబాబు కాదా అని ఆమె ప్రశ్నించారు.  రైతు నుంచి పారిశ్రామిక రంగం వరకూ అన్నీ కష్టాలేననీ, పట్టించుకునే వారే లేకపోయారనీ చెప్పారు. వైయస్ఆర్ మరణం తర్వాత ఇప్పటివరకూ మూడు బస్సు చార్జీలనూ, కరెంటు చార్జీలనూ పెంచారన్నారు. మహానేత ఉన్నప్పుడు సామాన్యుడికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారన్నారు.

Back to Top