విశ్వసనీయతకు చిరునామా వైయస్‌ జగన్‌


ప్రకాశం: విశ్వసనీయతకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిరునామా అని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన బతుకులు బాగుపడుతాయని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 100వ రోజు చీమకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు.  జిల్లా సమస్యలపై వైయస్‌ జగన్‌కు వివరించామన్నారు. ప్రతి ఒక్కరి సమస్యలు వైయస్‌ జగన్‌ విన్నారని, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, అప్పుడే మన సమస్యలు తీరుతాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వైయస్‌జగన్‌ అండగా నిలబతారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెస్తారని, విశ్వసనీయతకు చిరునామా వైయస్‌జగన్‌ అని పేర్కొన్నారు. 
Back to Top