అదనపు ఇంటి పన్ను రద్దు చేయాలి

నెల్లూరు(మినిబైపాస్‌): విలీన గ్రామాల ప్రజలపై యు.ఎ.సి.పెనాల్టీ రద్దు చేసి, విలీన గ్రామాల ప్రజలపై ఇంటి పన్నుల భారాన్ని తగించాలని రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి కోరారు.  స్ధానిక 38 వ డివిజన్‌ పరిధిలోని పరమేశ్వరి నగర్, పరమేశ్వరి అవేన్యూ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా స్ధానిక ప్రజలతో సమస్యలపై చర్చించారు. పొట్టెపాళెం ప్రాంతాల ప్రజలు అక్కడికి విచ్చేసి విలీన గ్రామాలలో ఇంటి పన్నుల పేరుతో అసలు, వడ్డీ కలిపి, యు.ఎ.సి.పెనాల్టీ రూపంలో 100 శాతం అదనంగా పన్నులు వేసి ప్రజలను నానా భాధలు పెడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. 

ఈ సంధర్బంగా రూరల్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ... విలీన గ్రామాల ప్రజలు ఇంటి పన్నుల ఇబ్బందుల్ని గతంలోనే కార్పోరేషన్‌ దృష్టికి తీసుకువచ్చామని, మునిసిపల్‌ శాఖామంత్రితో మాట్లాడానని, గత కార్పోరేషన్‌ సమావేశాలలో అన్ని పార్టీల కార్పోరేటర్లు ఈ సమస్య పరిష్కారం కోసం కోరారని, దీనిపై కార్పోరేషన్‌ లో ప్రత్యేక తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపారని, కానీ ఫలితం శూన్యమని, నేటికీ విలీన గ్రామాల ప్రజలు యు.ఎ.సి. పెనాల్టీతో నానా భాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మునిసిపల్‌ శాఖామంత్రి స్పందించి, నెల్లూరు నగర కార్పోరేషన్‌ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకొని, విలీన గ్రామాల ప్రజలపై యు.ఎసి.పెనాల్టీ రద్దు చేసి, విలీన గ్రామాల ప్రజలపై ఇంటి పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో మురళీ యాదవ్, ఉడత మధు యాదవ్, వాసుదేవ రావు, హేమంత్‌ హనుమాచారీ, మస్తాన్, వరప్రసాద్‌ రావు, నరేంద్ర, రమేష్, నవయ్య, శివయ్య, మణి, మందా పెద్దబాబు, ఆర్‌.కుమార స్వామి, మస్తాన్, రవీంద్ర సింగ్, జె.లక్షి్మ నారాయణ, కుమార్‌ హరి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top