ఎచ్చెర్ల‌..ఎన‌లేని అభిమానం



- జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- దారి పొడ‌వునా బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు 
- శ్రీ‌కాకుళం జిల్లాలో విజ‌య‌వంతంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
శ్రీ‌కాకుళం:  ప్రజాసంకల్ప యాత్ర హోరెత్తుతోంది. సంకల్ప యోధునికి వేలాది మంది జనం మద్దతు పలికి అడుగులో అడుగు వేస్తున్నారు. శ్రీ‌కాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది.  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో సమస్యలు చెప్పుకున్న బాధితులను ఓదార్చుతూ తనదైన శైలిలో జగన్‌ భరోసా ఇస్తున్నారు.  గ్రామాలన్నీ ఒక్కటైనట్లుగా జగన్‌ను చూసేందుకు తరలిరాగా, మహిళలు కుంకుమబొట్టు పెట్టి ఆశీర్వదించారు. బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.  రాజ‌న్న బిడ్డ‌పై సిక్కోలు ప్ర‌జ‌లు ఎన‌లేని అభిమానం చూపుతున్నారు.

ఇవాళ పాద‌యాత్ర ముఖ్యాంశాలు ఇలా..

– శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, సంతఉరిటి శివారులోని శిబిరం నుంచి యాత్ర ప్రారంభం.
– శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.
– యాత్రకు అన్ని వర్గాల ప్రజల సంఘీభావం.
– ఆ తర్వాత కాసేపటికే దవళపేట చేరుకున్న వైయస్‌ జగన్‌.
– పాదయాత్రలో జననేతను కలిసి బాధలు చెప్పుకున్న జి.సిగడాం మండలం పాలఖండ్యాంకు చెందిన కౌలు రైతు రమణారావు. హుద్‌హుద్‌ తుపాను వల్ల తాను సాగు చేస్తున్న నాలుగు ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బ తిన్నదని, అయినప్పటికీ ఎన్నిసార్లు తిరిగినా పరిహారం రాలేదని ఆవేదన చెందిన రమణారావు. ఇంకా ఆ పొలంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోయినప్పటికీ రెండేళ్ల పాటు విద్యుత్‌ బిల్లులు చెల్లించానని, మరోవైపు ఇప్పటికీ ఆ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయలేదని విపక్షనేతకు వివరించిన రమణారావు. కౌలు రైతు బాధలు విన్న జననేత, అధికారం చేపడితే తప్పనిసరిగా ఆదుకుంటామని భరోసా. 
– రాజకీయ కక్షతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని పాదయాత్రలో జననేత వద్ద మొర పెట్టుకున్న జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కళ్యాణి. టార్గెట్‌ రీచ్‌ కాలేదన్న కారణంతో మండలంలో 14 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించగా, వారు కోర్టును ఆశ్రయించారని కళ్యాణి తెలిపారు.  కోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలివ్వడంతో 12 మందిని తిరిగి నియమించినప్పటికీ తనను మాత్రం రాజకీయ కారణాలతో దూరంగా పెట్టారని విపక్షనేత వద్ద కళ్యాణి మొర పెట్టుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎలాగైనా న్యాయం చేయాలని ఆమె జననేతను వేడుకున్నారు.
– జి.సిగడాం మండలంలో చేపట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో మంత్రి బంధువులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని పలువురు స్థానికులతో పాటు, రైతులు పాదయాత్రలో జననేతను కలిసి ఫిర్యాదు చేశారు.
ఇంకా లావేరు మండలంలో నారాయణసాగరంను ఆధునీకరించాలని, ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కాలువకు మరమ్మతులు చేపట్టాలని ఈ సందర్భంగా రైతులు జననేతకు విజ్ఞప్తి చేశారు. ఇక రణస్థలం మండలంలో దాదాపు 25 పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని పలువురు నిరుద్యోగులు ఆక్షేపించారు.
– ఆ తర్వాత ఆనందపురం అగ్రహారం చేరుకున్న  వైయస్‌ జగన్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సం«ఘాల నాయకులు కలిశారు. తమకు ఎంతో నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దయ్యేలా చూడాలని వారు వేడుకున్నారు.
సానుకూలంగా స్పందించిన జననేత, అధికారం చేపట్టిన వెంటనే పథకం రద్దు చేస్తామని మరోసారి స్పష్టం చేయడంతో, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
– ఇక ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు న్యాయం చేయకపోగా కమిషన్ల కోసం ఉపాధి లేకుండా చేస్తున్నారని పాదయాత్రలో శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుడు శేషారత్నం.
తమకు గౌరవ పారితోషికంతో పాటు, బిల్లులు కూడా సక్రమంగా చెల్లించడం లేదని విపక్షనేతకు ఫిర్యాదు చేసిన శేషారత్నం. కమిషన్ల కోసం ఇప్పుడు తమను తొలగించాలని చూస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శేషారత్నం.
– అనంతరం పొందూరు చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్‌ ఆమదాలవలస నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు.
– ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత తమ్మినేని సీతారామ్‌తో పాటు, పార్టీ సీనియర్‌ నేతలు ధర్మాన కృష్ణదాస్, పార్టీ యువజన విభాగం కార్యదర్శి చిరంజీవి నాగ్‌ తదితరులు జననేతకు ఘన స్వాగతం పలికారు. 
ఇంకా పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా జననేతను చూసేందుకు తరలి వచ్చారు.
– ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని, దీంతో ధరలు పెరిగి అమ్మకాలు తగ్గాయని.. ఫలితంగా కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని పొందూరులో విపక్షనేతను కలిసిన ఖాదీ చేనేత కార్మికులు తమ బాధలు చెప్పుకున్నారు. 
అందువల్ల చేనేతకు అవసరమైన ముడి సరుకులకు రాయితీ ఇవ్వాలని, తమకు కూడా ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చేనేత కార్మికులు విజ్ఞప్తి చేశారు. వారి బాధలన్నీ సావ«ధానంగా విన్న జననేత, పార్టీ అధికారం చేపడితే తప్పనిసరిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
– పొందూరులో పాదయాత్ర అనంతరం శివారులో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరం వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగిన శ్రీ వైయస్‌ జగన్‌.
– ఇక అంతకు ముందు దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు. తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరిన తల్లులు. సెల్ఫీల కోసం ఆరాట పడిన మహిళలు, విద్యార్థినిలు.
– వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఇంకా ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన ప్రజలు.  
– జననేతతో కరచాలనం కోసం పోటీ పడిన బస్సులు, ఇతర వాహనాల ప్రయాణికులు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ యాత్రలో ముందుకు సాగిన   వైయస్‌ జగన్‌.
Back to Top