ఆర్టీసీ చార్జీల పెంపును ప్రతిఘటిస్తాం: భూమన


తిరుపతి: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక జీవకోనలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు చార్జీలను ఉన్న ఫలంగా పెంచి ప్రజలపై మోయలేని భారం మోపడం తగదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే సగటు మనిషి బతకలేని పరిస్థితి ఏర్పడందన్నారు. డీజిల్ ధర పెంపు ప్రభావం రవాణా రంగంపై చూపి, నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రజలపై భారం మోపకుండా ఆర్టీసీకి లాభాలు వచ్చే చర్యలు చేపట్టి సంస్థను గట్టెక్కించారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటుబడతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి,పంచాయతీ ఇన్‌చార్‌‌జ పెంచలయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎంవీఎస్ మణి, మార్కెట్ రవి, ఎస్‌సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, సి.సుబ్రమణ్యం, చంద్రయ్య, వెంకటేష్, బాలకృష్ణ, మహబూబ్‌బాషా, పుష్పాచౌదరి, చిత్ర, కవితమ్మ, భాగ్య మ్మ, లత, శారద పాల్గొన్నారు.
పార్టీలో చేరికలు
ఐరాల మండలం కాణిపాకం, అరుణానగర్ గ్రామాల నుంచి దాదాపు వందమంది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మండల కన్వీనర్ దేవేంద్రరెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన మా ట్లాడుతూ 2014 ఎన్నికల సమయానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీల్లో కార్యకర్తలు కనిపించే పరిస్థితి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నామని, అం దుకే యువకులు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు గణేష్ ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు చిన్నారెడ్డి, చరణ్‌రెడ్డి, సల్లా శివశంకర్‌శెట్టి, కేశవులు తదితరులు పాల్గొన్నారు.
మహానేత హయాంలోనే మహిళాభ్యున్నతి
మదనపల్లె అర్బన్: మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి పాలనలోనే మహిళలు  అభ్యున్నతి సాధించారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చెప్పారు. స్థానిక దేశాయ్ ఫంక్షన్ హాలులో మండలంలోని మహిళా గ్రామ కమిటీ కన్వీనర్లను ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్న ఆశయంతో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా మహానేత గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మహిళలను మహారాణులుగా చేయడానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం, అన్ని రంగాల్లో మహిళలు ఎదగడానికి పెద్ద పీట వేసి ప్రాధాన్యత తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. మహానేత తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు బుల్లెట్ షఫీ, సీనియర్ నాయకులు కత్తి కృష్ణమూర్తి, సి.చంద్రశేఖర్, మహిళా కన్వీనర్ వైజయంతి, కో కన్వీనర్ సునంద, గౌస్, నిమ్మనపల్లె ఎర్రయ్య, దాదాపు 500 మందిపైగా మహిళలు పాల్గొన్నారు.
గ్రామ కమిటీ కన్వీనర్లు వీరే
మండల మహిళా కన్వీనర్ వైజయంతి ఆధ్వర్యంలో గ్రామ కమిటీలకు మహిళా కన్వీనర్లను ఎన్నుకున్నారు. బసినికొండ పంచాయతీ కన్వీనర్‌గా విజయలక్ష్మి, వలసపల్లెకు టి.శాంత మ్మ, సీటీఎంకు డి.విమలమ్మ, కొత్తపల్లెకు టి.భారతి, మేకలవాండ్లపల్లెకు నారాయణమ్మ, పొన్నాటిపాళెంకు రాణి, పెంచుపాడుకు ఆర్.యశోదమ్మ, పోతబోలుకు శాంతమ్మ, కొత్తవారిపల్లెకు సునీత, కొండామర్రిపల్లెకు నారాయణమ్మ, అంకిశెట్టిపల్లెకు రాజమ్మను ఎన్నుకున్నారు.Back to Top