<strong>హైదరాబాద్, 18 డిసెంబర్ 2012:</strong> మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో కుడి మోకాలికి గాయం తగలడంతో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు శ్రీమతి షర్మిల మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్సులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. జూబ్లీహిల్సు ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు శ్రీమతి షర్మిల త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీమతి షర్మిలకు పుష్పగుచ్ఛాలు అందచేశారు.<br/>శ్రీమతి షర్మిలకు అపోలో ఆస్పత్రి వైద్యులు 'కీ హోల్' విధానంలో శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి మంగళవారం ఉదయమే ఆమె మోకాలికి శస్త్ర చికిత్స జరగాల్సి ఉంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, తన సోదరుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఆస్పత్రికి వస్తానని శ్రీమతి షర్మిల పట్టుబట్టారు. దీనితో వైద్యులు శస్త్ర చికిత్సను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.