99వ రోజు ప్రారంభమైన పాదయాత్ర

మంగళగిరి(గుంటూరు) 23 మార్చి 2013 :

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర  99వ రోజుకు చేరుకుంది. శనివారంనాడు ఆమె గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెరుకుల పూడి నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి చినపాలెం, పెదపాలెం, శృంగారపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం కొత్తపాలెం, నూతక్కి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు. ఇలా ఉండగా శుక్రవారం రాత్రి 98వ రోజు యాత్ర ముగిసేనాటికి ఆమె 1349 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.

Back to Top