78వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

గుంటూరు :

దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారానికి  78వ రోజుకు చేరింది. శుక్రవారం ఆమె సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొండమోడు క్రాస్ నుంచి యాత్రను ప్రారంభించారు. అనుపాలెం, చౌటపాపాయపాలెం, నందిరాజుపాలెం, నాగిరెడ్డిపల్లె, బెల్లంకొండ మీదగా షర్మిల పాదయాత్రను కొనసాగించనున్నారు. నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ చేరుకుని అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బసచేసిన ప్రాంతానికి చేరుకుంటారు.

Back to Top