విజయనగరంః ఈనెల 5న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయనగరం జిల్లా భోగాపురానికి వెళ్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ జిల్లాలో పర్యటిస్తారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగివచ్చేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. <br/>భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. 5వ తేదీన రాజాపులోవ జంక్షన్ నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. కవులవాడ,ఎ.రాయివలస, గూడపువలస తదితర గ్రామాల్లో వైఎస్ జగన్ కలియతిరుగుతారు. గూడపువలసలో బహిరంగసభలో పాల్గొని బాధిత రైతులతో మాట్లాడతారు.