56వ రోజు ముగిసిన పాదయాత్ర


మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగింది. అక్టోబర్ 18వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలోకి మంగళవారం ప్రవేశించింది. జిల్లాలోని మహేశ్వరం మండలంలో రెండు రోజులపాటు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. 56 రోజులుగా పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిల మొత్తం 790 కిలో మీటర్లు నడిచారు.

     రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా తమ సమస్యలు చెప్పుకుంటూ ఆమె వెంట నడిచారు. గ్రామాలకు తాగు నీరు ఇవ్వడంలేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సకల సదుపాయాలు కల్పించారన్నారు. కానీ ఇపుడున్న నాయకులు తమను పట్టించుకోవడంలేదని శ్రీమతి షర్మిల ఎదుట వాపోయారు. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్రలో సమస్యలు చెపితే తీరుతాయనే నమ్మకంతో ప్రజలు నమ్మకంతో శ్రీమతి షర్మిల వెంట కదం తొక్కుతున్నారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఉప్పుగూడలో షర్మిలకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు.

Back to Top