హైదరాబాద్, 22 మే 2013: ఈ నెల 27 సాయంత్రం నెక్లెస్‌రోడ్డులోని పీపుల్సు ప్లాజా నుంచి 10వేల మందితో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్టు వైయస్‌ఆర్ టియుసి అధ్యక్షుడు బి. జనక్ ప్రసాద్ తెలిపారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని సంవత్సర కాలంగా అక్రమంగా నిర్బంధించడానికి నిరసనగా ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, 28 వ తేదీన ఇందిరాపార్కు వద్ద వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు అనుమతి, భద్రత ఇవ్వాలని డిజిపి దినేష్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. తమ వినతిపై డిజిపి సానుకూలంగా స్పందించారని జనక్ ప్రసాద్ తెలిపారు.