వైయస్ స్ఫూర్తితోనే వైద్యశిబిరాలు

విజయవాడ: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారని, ఆ స్ఫూర్తితోనే ప్రతి నియోజకవర్గంలో వైద్యశిబిరాలు నిర్వహించి పేదవారికి ఆరోగ్య భరోసా కల్పిస్తున్నామని వైయస్ఆర్ సీపీ వైద్యవిభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ మెహబూబ్ షేక్ చెప్పారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీతారాంపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఏలూరు సెయింట్ జాన్స్ వైద్యకళాశాలకు చెందిన వైద్యవిద్యార్థులు, విజయవాడ, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన పీజీ విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెహబూబ్ షేక్ మాట్లాడుతూ త్వరలో పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన వస్తుందని, వైయస్ ఆశయాలను ముందుకు తీసుకెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. శిబిరంలో పాల్గొన్న దాతలకు, నాయకులకు, వైద్యవిద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ వైద్యవిద్యార్థులకు వైయస్ చేసిన సేవలకు రుణం తీర్చుకునే ఉద్దేశంతో వైద్యవిద్యార్థులు రక్తదానం చేయటానికి ముందుకొచ్చారన్నారు. రక్తాన్ని భూమి మీద తయారు చేసే అవకాశం లేదన్నారు. వ్యక్తులు దైవానికి ప్రతిరూపమని, రక్తదానం చేస్తే ప్రాణం పోసినట్లేనన్నారు. పార్టీ నాయకుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ వైయస్ఆర్ ప్రతి పేద, మధ్య తరగతి వాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య భద్రత కోసం రూపొందించిన పథకం ఆరోగ్యశ్రీ అని చెప్పారు. మనిషి బతకడానికి కావలసిన రక్తాన్ని దానం చేయటానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. శిబిరంలో పార్టీ నాయకులు అశోక్, విశ్వనాథ్, బషీరా, సాంస్కృతిక విభాగం నాయకురాలు మంజుశ్రీ, అవనిగడ్డ నియోజకవర్గం నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కల్లూరులో..
కల్లూరు: రక్తదానం ప్రాణదానంతో సమానమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నాయకుడు మహేష్‌నాయుడు ఆధ్వర్యంలో స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చరితారెడ్డి శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. సమాజంలో ఎంతో మంది రక్తహీనతతో బాధ పడుతున్నారన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు సంభవించినప్పుడు.. గర్భిణులకు ప్రసవ సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుందన్నారు. అలాంటి వారికి రక్తదానం చేస్తే పునర్జన్మనిచ్చినట్లేనన్నారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి బలహీనత రాదని.. కొన్ని గంటల్లోనే సాధారణ స్థితికి చేరుకోవచ్చన్నారు. అనంతరం రిటైర్డు ఆర్‌ఎంఓ రామ్‌గోపాల్‌రావు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రచార విభాగం కన్వీనర్ ఐజయ్య, మైనార్టీ సెల్ కన్వీనరు హఫీజ్‌ఖాన్, సేవాదళ్ కన్వీనర్ లక్ష్మీకాంతారెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ అజయ్‌కుమార్, డాక్టర్స్ విభాగం కన్వీనర్ డాక్టర్ అల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వై.రామయ్య, సురేందర్‌రెడ్డి, జయంతి వెంకటేశ్వర్లు తదితరులు రక్తదానం ప్రముఖ్యతను వివరించారు. ఆ తర్వాత నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, హఫీజ్‌ఖాన్‌తో పాటు మరో 63 మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. డాక్టర్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్‌ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది రక్త సేకరణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా రక్త దాతలకు గౌరు చరితారెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రకళాధర్‌రెడ్డి, దళిత నాయకుడు సి.హెచ్.మద్దయ్య, సుంకన్న, మైనారిటీ నాయకులు ఎస్.టి.మసూద్, ఇంతియాజ్‌అలీఖాన్, ఖాదర్‌వలి, సాహిల్‌బాష, ఎస్.ఎం.డి.రఫి, మున్నా తదితరులు పాల్గొన్నారు. ఆదోని పట్టణంలోనూ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటైంది.
మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్: ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై ద్య విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ర క్తదాన శబిరం విజయవంతంగా ముగి సింది. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్త దానం చేశారు. పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల ర వీంద్రనాథ్‌రె డ్డి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాన్నిప్రారంభిం చారు. ఈ సందర్భంగా మహబూబ్‌నరగ్ అసెంబ్లీ నియోజకవ ర్గ నేత ఎం.సురేందర్ రెడ్డి మొదట రక్తదానం చేశారు. వైద్య విభాగం జిల్లా క న్వీనర్ డాక్టర్ శివరాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రెడ్డిగా రి రవీందర్ రెడ్డి, మహిళా విభాగం జి ల్లా కన్వీనర్ శారద, మహిళా నాయకురాలు లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పబ్బు జంగయ్య గౌడ్, మాచన్‌పల్లి మా జీ ఎంపీటీసి వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యు లు, యువజన విభాగం జిల్లా నేతలతో పాటు 170 మంది కార్యకర్తలు రక్తదా నం చేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొ సైటీ, జిల్లా ఆసుపత్రి రక్త నిధి, ఎస్‌వీ ఎస్ మెడికల్ కాలేజీ బ్లడ్ బ్యాంక్‌కు చెం దిన డాక్టర్లు, సిబ్బంది దాతల నుంచి రక్తాన్ని సేకరించారు.
రక్తదానం మానవతకు దర్పణం: ఎడ్మ కిష్టారెడ్డి
ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ జి ల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడు తూ రక్త దానం చేయడం మానవతకు నిదర్శనమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 104 , 108 పథకాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదన్నారు. మాజీ ఎమ్మెల్యే రావుల మాట్లాడుతూ వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా రక్తానికి ప్ర త్యామ్నాయం కనుగొనలేక పోయారన్నారు. మనుషులకు రక్తం అవసమైనప్పుడు తోటి వారే ఇవ్వాలన్నారు.
మూ డు నెలలకు ఒకసారి రక్తదానం చేయాల ని సూచించారు. వైద్య విభాగం జిల్లా క న్వీనర్ డాక్టర్ శివరాం నాయక్ మాట్లాడుతూ యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో సే వా కార్యక్రమాలు చేపడుతున్నామన్నా రు. భారీ సంఖ్యలో రక్తదానం చేసేం దుకు ముందుకువచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అసుపత్రి సూపరింటెండెంట్ డా క్టర్ శ్యామ్యూల్, పార్టీ నాయకులు భీ మయ్య గౌడ్, పుల్లయ్య శెట్టి, మాధవ య్య, కోడూరు రాములన్న, చెన్నారం వెంకట్‌రెడ్డి, రవిప్రకాశ్, సయ్యద్ సిరాజుద్దీన్, బెక్కెరి శ్రీనివాస్‌రెడ్డి, కోన దేవయ్య, పబ్బు జంగయ్య గౌడ్, చిలకమర్రి రవీందర్ రెడ్డి, ప్రీతం, జెట్టి రాజశేఖర్, హైదర్ అలీ, ఆర్టీసీ జహంగీర్, రవికిరణ్, వాజిద్, న్యాయవాదులు మద్దిరాల విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, శోభనాదేవి, శాంతమ్మ, కందూరు లక్ష్మి, పి.అంజిరెడ్డి, వేముల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్ ఎనలేని కృషి
రామచంద్రాపురం: మైనార్టీల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారని వైయస్ఆర్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంజిరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నేతలు పెద్ద ఎత్తున వైయస్ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ మైనార్టీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వైయస్ఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. మైనార్టీలు విద్యా పరంగా అభివృద్ధిచెందేందుకు వారికి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.

Back to Top