ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాలోకి వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర

శ్రీకాకుళంః ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించనున్న ప్రజా సంకల్పయాత్ర..ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. జగన్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్,షెడ్యూల్‌పై వైయస్‌ఆర్‌సీపీ నేతలు చర్చలు జరిపారు. వైయస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు.  వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఒక జైత్రయాత్రలా దిగ్విజయంగా పూర్తిచేయాలని ప్రజల్లో కనబడుతుందన్నారు.ప్రతి నియోజకవర్గంలోని వైయస్‌ జగన్‌ బహిరంగ సభ ఉంటుందన్నారు.ఆంధ్రరాష్టానికి ఒక పెద్ద సంకేతాన్ని  శ్రీకాకుళం జిల్లా పాదయాత్ర ఇవ్వబోతుందని భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.
Back to Top