2000కిమీ పూర్తిచేసుకున్న షర్మిల

రావికంపాడు(పశ్చిమ గోదావరి జిల్లా) 16 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామం వద్ద గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆమె ఈ మైలురాయిని చేరుకున్నారు. ఇంతవరకూ ఆమె పది జిల్లాలు, 68 నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేశారు. కిందటేడాది అక్టోబరు 18న ఆమె ఇడుపులపాయలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. అనంతపురం జిల్లా పెద్దకోట్ల వద్ద 100కి.మీ, మహబూబ్ నగర్ కొంకాల వద్ద 500 కి.మీ., నల్గొండ జిల్లా కొండప్రోలు వద్ద 1000కిమీ, కృష్ణా జిల్లా పెడన 1500 కిలోమీటర్లు పూర్తిచేసుకున్నారు.

Back to Top