వైయస్‌ఆర్‌ సీపీలో 200ల మంది చేరిక

కిర్లంపూడి: ప్రజారంజక పాలనను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు అన్నారు. కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో మాజీ సర్పంచ్‌ పట్టు రామాయమ్మ, పట్టు చిన్నయ్య, పట్టు కనకారావు, పట్టు చంటిబాబు, పట్టు గంగాధర్, జిన్నాల పెద్దకాపు, గూడెపు అబ్బులు, ఉగ్గిన నాగుల ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీలోకి చేరారు. వారికి చంటిబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను అన్నివిధాల నిట్టనిలువునా ముంచారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్రంలో అన్నివర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. రాజన్న పాలన మళ్లీ తిరిగి రావాలంటే జననేతను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని ఆయన కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top