కేంద్ర కార్యాలయంలో ప్రజా సంకల్ప యాత్ర 200వ రోజు వేడుకలు

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 200వ రోజు అయిన సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ గతేడాది నవంబర్‌ 6న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఇప్పటికి 200 రోజుల పాటు పాదయాత్ర చేశారని, సుమారు 2430 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు. లక్షలాది మంది ప్రజలను కలిశారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ఆప్యాయతలు మరువలేనివన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ త్వరలోనే రాజన్న రాజ్యాన్ని తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైయస్‌ జగన్‌కు ప్రజలు ఆశీస్సులు అందజేయాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు  ఇవ్వాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇక్బాల్, ప్రఫుల్లారెడ్డి, చల్లా మధు, సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top