17 నుంచి ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’విశాఖః నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముందని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాద్‌రావు అన్నారు. ఈ నెల 17 నుంచి బూత్‌ల వారీగా రావాలి జగన్‌..కావాలి జగన్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఓటర్ల తొలగింపు, నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. బూత్‌ కమిటీలను తక్షణమే పూర్తిచేయాలన్నారు.. పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిగామంలో నవరత్నాల పోస్టర్స్,ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని నాయకులకు,కార్యకర్తలకు తెలిపారు. 
Back to Top