158వ రోజుకు 2,095 కి.మీ పూర్తి

ఉండి, 25 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారానికి  158  రోజులు పూర్తిచేసుకుంది. శ్రీమతి షర్మిల పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆరేడు గ్రామం నుంచి యాత్ర ప్రారంభించారు. 158వ రోజు యాత్ర పూర్తయ్యేనాటికి మొత్తం 2,095.3 కిలోమీటర్లు నడిచారు.  ఆమె కోలమూరు, పాములపర్రు మీదుగా ఉండి నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలిచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఎన్‌ఆర్పీ అగ్రహారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె 11.5 కిలోమీటర్లు నడిచారు.  పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు పేర్ని నాని, మద్దాల రాజేశ్, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకర్, నేతలు మొవ్వ ఆనంద శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు ఉమాబాల, మేడిద జాన్సన్ తదితరులున్నారు.

Back to Top