109వ రోజు పాదయాత్ర పర్ణశాల నుంచి ప్రారంభం

చిట్టిగూడూరు (కృష్ణాజిల్లా), 2 ఏప్రిల్‌ 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం 109వ రోజు పాదయాత్ర కృష్ణాజిల్లాలోని పర్ణశాల నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అభిమానులు, పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య శ్రీమతి షర్మిల యాత్రను మొదలుపెట్టారు. మహానేత తనయకు ఆశీస్సులు అందజేసేందుకు ఆమె బసచేసిన ప్రాంతానికి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రతిఒక్కరికీ శ్రీమతి షర్మిల అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పర్ణశాల నుంచి చిట్టిగూడూరు, గూడూరు చేరుకుని శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. అక్కడి నుంచి రామరాజుపేట వరకూ పాదయాత్ర చేస్తారు. రామరాజుపేటలో ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

అక్కడి నుంచి సుల్తాన్‌నగర్, మూడు స్తంభాల సెంట‌ర్, రేవతి సెంటర్, బస్టాండ్ సెంట‌ర్, లక్ష్మీ టాకీసు వరకూ వెళతారు. లక్ష్మీ టాకీసు సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభలో వైయస్ అభిమానులు, ‌పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. సభ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి వెళతారు. ఈ రోజు 14.8 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, కృష్ణాజిల్లా కన్వీనర్‌ సామినేని ఉదయభాను తెలిపారు.
Back to Top