<strong>విజయనగరంః</strong> వైయస్ జగన్‌ను కలిసి 104 ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.151 జీవో అమలు చేయాలని వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు పెంచడంలేదన్నారు. ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలో వస్తే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.