ఉత్తరాఖండ్‌ బాధితులకు ఎన్నారై వింగ్‌ విరాళం

హైదరాబాద్ :

ఉత్తరాఖాండ్‌ వరద బాధితుల పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం ఉదారత ప్రదర్శించింది. వారికి ఆర్థిక సహాయం చేసేందుకు పార్టీ ఎన్నారై వింగ్‌ రూ. 5 లక్షలు విరాళాలు సేకరించింది. అమెరికా, కువైట్, బ్రిటన్‌ తదితన దేశాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు ఎన్నారై అభిమానుల నుంచి ఈ నిధులు సేకరించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం నాడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ద్వారా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి ‌సహాయ నిధికి పంపించినట్లు ఎన్నారై విభాగం కన్వీనర్‌ మేడపాటి వెంకట్‌ తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం, వివిధ దేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు ఈ విరాళాల మొత్తాన్ని పంపించారు.

తాజా ఫోటోలు

Back to Top